![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -371 లో... రామ్ ని తీసుకొని రామలక్ష్మి దగ్గరికి వస్తాడు సీతాకాంత్. వద్దన్నా పదే పదే ఎందుకు వస్తున్నారని రామలక్ష్మి అడుగుతుంది. ఇక మీరు లండన్ వెళ్ళిపోతారు కదా.. ఉన్నన్ని రోజులు మీతో టైమ్ స్పెండ్ చెయ్యడానికి వచ్చామని సీతాకాంత్ అంటాడు.
మిస్ ఒక అట ఆడుకుందామా అని రామ్ అనగానే రామలక్ష్మి సరే అంటుంది. కళ్లకి గంతలు కట్టుకొని మేమ్ ఎక్కడ ఉన్నామో కనుక్కోవాలని రామ్ అంటాడు. ముందుగా రామ్ కి గంతలు కడుతారు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ కి కడుతారు. ఆ గేమ్ ఆడుతున్నంత సేపు రామలక్ష్మి సీతాకాంత్ ఒకరినొకరు టచ్ చేసుకుంటు ఉంటారు. సీతకాంత్ పై రామలక్ష్మి పడిపోతుంది. దాంతో రామలక్ష్మి సిగ్గుపడి వెళ్ళిపోతుంది సీతాకాంత్ కూడా సిగ్గు పడతాడు. నువ్వే కదా మీ మిస్ నాపై పడేలా చేసావని రామ్ ని సీతాకాంత్ అడుగుతాడు. అదేం లేదని రామ్ అంటాడు.
రామలక్ష్మి దగ్గరిక సీతాకాంత్ వెళ్లి కాసేపు క్యారెక్టర్ మార్చుకుందామా అని సీతాకాంత్ అంటాడు. నేను మైథిలి మీరు సీతాకాంత్ అని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు కాసేపు అలా మాట్లాడుకుంటారు. దాంతో సీతాకాంత్ క్యారెక్టర్ లో ఉన్న రామలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత రామ్ ఇక్కడే ఉంటాడు మీరు వెళ్ళండి అని రామలక్ష్మి అనగానే సీతాకాంత్ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత సీతాకాంత్ తన ఫ్రెండ్ సీఐ తో మాట్లాడతాడు. ఎవరిని అడిగినా కూడా తను మైథిలి అంటున్నారని సీఐ చెప్తాడు. ఇద్దరు కలిసి రామలక్ష్మినా మైథిలినా అని కనుకోవడానికి ఒక ప్లాన్ చేస్తారు. మరుసటి రోజు సీతాకాంత్, సీఐ ఇద్దరు రామలక్ష్మి ఇంటికి వెళ్తారు. రామలక్ష్మి ఫింగర్ ప్రింట్స్ ద్వారా కనిపెట్టొచ్చని ఇద్దరు అనుకుంటారు. మీకు ఏమైనా అవసరమైతే నాకు కాల్ చెయ్యండి అని సీఐ తన విజిటింగ్ కార్డు ఇస్తాడు. దానిపై రామలక్ష్మి ఫింగర్ ప్రింట్స్ పడతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |